06-07-2025 08:16:29 PM
మంత్రి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రంలో ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్..
పెద్దపల్లి (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను దళిత గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేకంగా కేటాయించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్(Telangana SC ST Working Journalists Association) ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఆదివారం ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందించి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో వివిధ ఛానళ్లు, పత్రికలలో దళిత గిరిజన జర్నలిస్టు ఏండ్ల తరబడి తరబడి పనిచేస్తున్నారని వారంతా చాలీచాలని వేతనాలతో జీవితం వెల్లదిస్తున్నారని మంత్రికి తెలిపారు.
కుటుంబ భారంతో సతమతమవుతున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేసేందుకు దళిత గిరిజన జర్నలిస్టులు పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం, ఇందిరమ్మ ఇండ్లు, అంబేద్కర్, అభయా హస్తం వంటి పథకాలను ప్రత్యేకంగా కేటాయించాలని, ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు వెంటనే ఇవ్వాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను దళిత గిరిజనకు ప్రత్యేకంగా కేటాయించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పెద్దపెల్లి జిల్లా నాయకులు బందెల శ్రీనివాస్, ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు స్వామి, నాయకులు దేవేందర్ పాల్గొన్నారు.