calender_icon.png 7 July, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యధావిధిగా యూరియా అమ్మకాలు

06-07-2025 08:08:04 PM

ఆందోళనకు కారకులైన డీలర్లపై కఠిన చర్యలు..

జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి..

కోదాడ: జిల్లాలో వానకాలం రైతులు సాగు చేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని డీలర్లు యధావిధిగా యూరియా అమ్మకాలు జరుపుతారని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి(District Agriculture Officer Sridhar Reddy) తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఫెర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు, వ్యవసాయ అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఫెర్టిలైజర్ షాపు యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని నేటి నుండి యధావిధిగా యూరియా అమ్మకాలు జరుగుతాయన్నారు.

రైతులు ఆందోళన చెందెందుకు కారకులైన వారిపై, యూరియాను బ్లాక్ చేసిన అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామన్నారు. నేటి నుంచి యధావిధిగా యూరియా అమ్మకాలు కొనసాగిస్తామన్నారు. ఏవోలు రజని, రాజు, ఫెర్టిలైజర్ డీలర్స్ ఉపాధ్యక్షులు జూలకంటి రామిరెడ్డి, డీలర్ రామారావు పాల్గొన్నారు.