19-07-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
గద్వాల, జూలై 18 ( విజయక్రాంతి ) : అలంపూర్ చౌరస్తా లో గల ప్రభుత్వ ఆసుపత్రి ని వినియోగంలోకి తీసుకుని రావాలని ఆసుపత్రి ఇంచార్జ్ సూపర్డెంట్ సయ్యద్ ను మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కృషితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.
టిఆర్‌ఎస్ పరిపాలనలో ఎలక్షన్ల కోసం ఒక పావుగా వాడుకున్న ఆసుపత్రి నేడు శిథిల వ్యవస్థకు చేరిందని ఎంతోమందికి వైద్య ఆరోగ్య సేవలందించాల్సిన ఆసుపత్రి ఇలా ఉండడం చాలా బాధాకరమని ఆయన అన్నారు ఆస్పత్రిలో అవసరమైన ఎక్విప్మెంట్, సిబ్బంది మీ వెంటనే నియమించాలని సంబంధిత మంత్రిగా దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే అలంపూర్ ఏరియా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు.
నియోజకవర్గ ప్రజలందరికీ కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత అని అయన తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అలంపూర్ నియోజకవర్గంలో చేసుకొనే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరియు జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ వినోద్ కుమార్, మరియు జోగులాంబ దేవాలయ కమిటీ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి, మరియు అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ మండల అధ్యక్షులు పదాధికారులు ముఖ్య నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.