18-07-2025 11:52:27 PM
సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు
మందమర్రి,(విజయక్రాంతి): వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం లేకుండా తగిన చర్యలు తీసుకోని రఘుపతి మెరుగుపరచాలని సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం ఆయన ఏరియా జిఎం జి దేవేందర్ తో కలిసి కేకే ఓసిపి గనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓసిపి వ్యూ పాయింట్ నుండి ఓసిపి పని ప్రదేశాలను పరిశీలించడం తో పాటు ఉత్పత్తి, ఉత్పాదకత పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓసిపి వ్యూ పాయింట్ సమీపంలో మొక్కలు నాటారు. అనంతరం ఓసిపి క్వారీలో పని ప్రదేశాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం మార్గం సులువుతుందని తెలిపారు. అదేవిధంగా ఓసిపి లో నిర్మిస్తున్న పిఓబి ప్లాంట్ ను సందర్శించి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేకే 1 రైల్వే సైడ్, కేకే ఓసి ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. అనంతరం ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లు, అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.