calender_icon.png 13 December, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరులై పారుతోన్న మద్యం.. ఎన్నికలకు కిక్కు!

13-12-2025 12:00:00 AM

  1. చుక్కా ముక్కతోనే ప్రచారం
  2. మద్యం మత్తులో గ్రామాలు
  3. నిశ్శబ్దంగా ఎన్నికల ప్రచారం

బెల్లంపల్లి, డిసెంబర్ 12 : మంచిర్యాల జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు మంచిర్యాల నియోజక వర్గంలో, ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలో ముగిశాయి. రెండవ విడత బెల్లంపల్లి నియోజక వర్గంలో ఈ నెల 14న, మూడో విడత ఈ నెల 17న చెన్నూర్ నియోజక వర్గంలో జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సర ళి మారిపోయింది.

హంగు ఆర్భాటం లేకుం డా ప్రణాళిక ప్రకారం ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు ఒకరికిమించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అంతా నిశ్శబ్ద విప్లవంలా ఎన్నికల ప్రచారం సాగుతుంది. అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలిసి ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. సింగిల్ ప్రచారంతోనే ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఒం టరిగా వెళ్ళి అభ్యర్థులు ఓటర్లను కలిసి వేడుకుంటున్నారు. చడీచప్పుడూ లేకుండా ఎన్ని కల ప్రచారం ఓ వైపు చేస్తూనే మరోవైపు ఓటర్లు, యూత్ బృందాలకు మద్యం పంపి ణీ చేస్తున్నారు.

పోటాపోటీగా అభ్యర్థుల ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మందు బాటిల్లేనే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకున్నారు. ఎన్ని నిబంధనలు ఉన్నప్ప టికి మద్యం పంపిణీని అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. పకడ్బందీగా మద్యం బాటిళ్ల తో ఓటర్లకు గాలం వేస్తూనే ఉన్నారు. పోలీసు లు గుడుంబాను పడుతున్నప్పటికీ మద్యాన్ని మాత్రం పట్టుకోలేకపో తున్నారు. ప్రతిరోజూ రాత్రి చక్క, ముక్క పార్టీలు లేని పల్లె లు లేవంటే అతిశయోక్తి లేదు.

బెల్లంపల్లి నియోజక వర్గంలోనీ బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నేన్నెల, వేమనపల్లి మండలాల్లో ఎన్నికలు రెండో విడతగా ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక అంకం నుంచి నామినేషన్లు ముగిం పు ఘట్టం వరకు ఎన్నికల హడావుడి జోరందుకుంది. ఉపసంహరణ తరువాయి నుంచి అభ్యర్థులు బరిలో దిగారు. పొద్దంతా ప్రచారంలో తీరిక లేకుం డా శ్రమిస్తున్న కార్యకర్త లు ఇక రాత్రిళ్ళు మద్యం పార్టీలతోటే సేద తీరుతున్నారు.

మద్యం పార్టీల సమక్షంలో వ్యూహా లు రచిస్తున్నారు. ఓటర్ల నాడిని కనిపెట్టేందుకు కొత్త కొత్త ప్రణాళికలు వేస్తున్నా రు. ‘మందు’ల్లోనే మునిగి తేలుతూ ప్రజలకు గాలం వేసేందుకు స్కెచ్‌ల పై తర్జన బర్జనల మధ్య నే తెల్లవారుతుంది. నిన్న మొన్నటి వరకు ఓసీ గిన ఓటరు నేడు డాక్టర్ ఈ మందు తాగొద్దంటున్నాడని, ఓ లెవల్ మందు కావాలని అ డు గుతున్నాడని, ఎన్నికలు అంటే ఇన్ని తిప్పలు పడాల్సి వస్తోందా అని అభ్యర్థులు బాధపడిపోతున్నారు.

గెలవాలనే లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు, ఖర్చులకి వెనుకాడేది లేదన్నట్టు అభ్యర్థులు మరింత ఉత్సాహాన్ని కూడగట్టుకొని పనిచేస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో మద్యం సరిపోక  బెల్లంపల్లి, మంచిర్యాల వంటి ప్రధాన పట్టణాలకు వచ్చి మద్యాన్ని తీసుకెళ్తున్నారు. మద్యం కొనుగోళ్లకు లక్షలు గుమ్మరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల న్నీ మద్యం మత్తులోనే జోగుతున్నాయంటే మద్యం ఎలా  పారుతుందో అర్థం చేసుకోవచ్చు. 

నోట్లతోనే ఓట్లు..

అభ్యర్థులు తమ విజయవకాశాలను సులభతరం చేసుకునేందుకు ఓటర్లకు మద్యంతో పాటు నోట్లు కూడా చల్లుతున్నారు. ఓట్లు పడాలంటే నోట్లు ఇవ్వాల్సిందే. ఇది ఆనవాయితిగ వస్తున్న ఎన్నికల్లో ప్రధాన సంప్రదా యం. ఉచితంగా ఎవరిని మచ్చిగా చేసుకోవడం అసాధ్యం కనుక ఒకవైపు మద్యం, మరోవైపు నోట్లు అభ్యర్థుల ప్రచారంలో ప్రధాన ఆస్త్రాలుగా మారాయి.

ఎన్నికల నియమ నిబంధనలు ఎన్ని ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి ఈ నెల 14న పోలిం గ్ ఉండటంతో అభ్యర్థుల్లో హైరానా మొదలైంది. గ్రామంలో ఎన్నికల ప్రచా రం వేడెక్కింది. పోటా పోటీగా ఇంటిం టి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నెల 13న ప్రచారం ఉండదు కాబట్టి ఓటర్లకు మందు పార్టీలు, మద్యం సీసాల పంపకాలు చేసేందుకు రహస్యంగా ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమవుతున్నారు.