calender_icon.png 13 December, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి నోచుకోని భోథ్ పంచాయతీ

13-12-2025 12:00:00 AM

  1. అక్కడ సమస్యలు... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 
  2. నియోజకవర్గ కేంద్రమైన కనీస మౌలిక సదుపాయాల కరువు
  3. ఒకప్పుడు హేమా ఏమీలు రాజ్యమేలిన ప్రాంతం..
  4. రెవెన్యూ డివిజన్ కోసం ఎన్నో ఉద్యమాలు
  5. బోథ్ మేజర్ గ్రామ పంచాయతీపై  ప్రత్యేక కథనం

బోథ్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : అది ఓ నియోజకవర్గ కేంద్రం... అయినా అభివృద్ధికి మాత్రం ఆమడ దూరం... నియోజకవర్గ పరిధిలో ఓ మూలన ఉండే బోథ్ నియోజకవర్గ కేంద్రంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మా రింది. ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్న ఈ నియోజకవర్గం స్వాతంత్రం కంటే ముందు బోథ్ తాలూకాగా కొనసాగింది. అనంతరం 1956 లో గ్రామ పంచాయతీగా అవతరించి, అప్ప టి నుండి పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు.

బోథ్ మేజర్ గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికలు ఎప్పుడు ప్రత్యేకమై నవే. ఈ పంచాయితీ పరిధిలో మొత్తం 8,535 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 4,078, స్త్రీలు 4,465 మంది ఉన్నారు. ఈసారి రిజర్వేషన్ల ప్రాతిపదికన బోథ్ మేజర్ గ్రామ పంచాయతీ ఎస్సీ మహి ళా స్థానానికి కేటాయించారు. మూడో విడతలో ఈనెల 17న ఎలక్షన్లు జరగనున్నాయి. సర్పంచ్ స్థానానికి 10 మంది పోటీలో నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ గెలు పు కోసం తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

మంత్రుల నియోజకవర్గం... హేమాహేమీలు ఏలిన ప్రాంతం.. 

నియోజకవర్గం నుంచి ఎందరో హేమాహేమీలు ఏలిన ప్రాంతం ఇది. ఈ నియో జకవర్గంలో నుంచి ఇద్దరు మంత్రులుగా పనిచేసిన నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యము అని చెప్పవచ్చు. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో గోడం రామారావు, ఆ తర్వాత ఆయన కుమా రుడు గోడం నగేష్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోమంత్రిగా  పనిచేసిన వారే. అంతరం సోయం బాపూరావు,  రాథోడ్ బాపూరావు ఎమ్మెల్యే లు పనిచేశారు. ప్రస్తుతం అనిల్ జాదవ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

పేరుకుపోయిన సమస్యలు..

పేరుకు బోథ్ మేజర్ గ్రామపంచాయతీ అయినప్పటికీ అభివృద్ధిలో అంతంత మాత్రమే. బోథ్ లో అనేక సమస్యలు వెక్కిరిస్తున్నాయి.

* బోథ్ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి...

* బస్టాండ్ నుండి మెయిన్ రోడ్ గాంధీ చౌక్  మీదుగా పురాణ బజార్ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ప్రభుత్వ హాస్పిటల్ లింకు రోడ్డు వరకు, పిప్పల్ దరి లింక్ రోడ్డు నుండి ఖాసీం బట్టి వరకు గల ప్రధాన రోడ్లు ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసినవే.

* బోథ్‌లో ఫైర్ స్టేషన్, జనరల్ డిగ్రీ కాలేజ్, మినీ స్టేడియం, లైబ్రరీ ఏర్పాటు చేయాలి.

* బస్టాండ్ నుండి బోథ్ ఎక్స్ రోడ్డు వరకు ఉన్న రహదారికి ఇరువైపులా డ్రైనేజీలు లేక పొవడంతో ప్రజలు వినియోగిస్తున్న మురుగునీరు రోడ్డు పైనే ప్రవహిస్తోంది. వెంటనే డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి.

* ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఉన్న రోడ్లకు డ్రైనేజీలు లేవు వర్షపు నీరు రోడ్డుపైనే పారుతుంటుంది. ఆయా రోడ్లకు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి...

* బోథ్ పట్టణంలో ఉన్న మొత్తం 16 వార్డులు ఉండగా మేజర్ వార్డుల్లో సమస్యలు తిష్టవేశాయి

* ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతలో ప్రజలకు మరుగుదొడ్లు, నీటి సౌక ర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.

* సాయి నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు కు కల్వర్టులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, స్మశాన వాటిక ఏర్పాటు చేయాలి.

* సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.పైన పేర్కొన్న సమస్యలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్పంచ్ ఆశావాహులు పైన పేర్కొన్న సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని  ప్రజల్లో బలమైన నమ్మకాన్ని తీసుకొచ్చినట్లైతే గెలుపును వరించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.