calender_icon.png 6 May, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోవియట్ సైనికులపై గ్రహాంతరవాసుల దాడి

17-04-2025 12:10:24 AM

అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఫైల్స్‌లో బహిర్గతం

న్యూయార్క్: సోవియట్ సైనికులపై ఉక్రెయిన్‌లో గ్రహాంతరవాసులు దాడి చేసిన విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ బహిర్గతం చేసిన ఫైల్స్‌లో ప్రస్తావించారు. సోవియట్‌కు చెందిన ఒక ప్లాటూన్ దళం సాసర్ ఆకారంలో ఎగురుతున్న వస్తువులపై కాల్పులు జరిపింది. దీంతో అందులోని గ్రహాంతరవాసులు ఎదురుదాడి చేసినట్టు సీఐఏ పేపర్‌లో పేర్కొంది. ఈ దాడిలో 23 మంది సైనికులు అక్కడి నుంచి పారిపోవడానికి ముందే బిగుసుకుపోయారట. కొందరి రక్తం గడ్డ కట్టుకుపోయినట్టు కూడా గుర్తించినట్టు ఆ పత్రాల్లో ఉంది.

1991లో సోవియట్ కుప్పకూలిన తర్వాత దీనికి సంబంధించిన 250 పేజీల కేజీబీ రిపోర్టును సీఐఏ సంపాదించింది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మాలాలు, చిత్రాలు అందులో ఉన్నట్లు ‘న్యూయార్క్ పోస్ట్ పత్రిక’ కథనం ప్రచురించింది. సీఐఏ వద్ద ఉన్న భారీ కలెక్షన్ ప్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలక్ట్రానిక్ రీడింగ్ రూమ్‌లో అందుబాటులో ఉన్నట్టు ఆ పత్రిక పేర్కొంది. ఈ ఘటన 1989 నుంచి 1990 మధ్యలో చోటుచేసుకొన్నట్టు కెనడాకు చెందిన వరల్డ్ న్యూస్ 1993లో వెల్లడించింది. ఒకవేళ గ్రహాంతరవాసుల ఘటన జరిగినా ప్రచురితమైన నివేదిక మాత్రం ఫస్ట్‌హ్యాండ్ సమాచారం నుంచి వచ్చింది కాదని.. ఐదారు చేతులు మారిన సమాచారాన్ని ప్రచురించినట్టుగా ఉందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.