12-11-2025 12:42:19 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో రెండోసారి అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించా రు. సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాతే పాల్గొనగా, జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలిన్ ప్రభాత్ వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ 13 మంది మృతి చెందిన ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న ప్రతి నిందితుడిని వేటాడాలని పోలీసులు మరియు ఏజెన్సీలను ఆదేశించారు.‘ఢిల్లీ కారు పేలుడుపై సీనియర్ అధికారులతో సమీక్ష సమావే శాలు నిర్వహించాను. ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి నిందితుడిని వేటాడాలని అధికారులను ఆదేశించాను. ఈ పేలుడులో ఉన్న ప్రతిఒక్కరిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయి’ అని సమావేశాల అనంతరం అమిత్ షా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఈ చర్యలో పాలుపంచుకున్న వారందరూ చట్టం ముందు తప్పకుండా నిలబడతారని, కఠిన శిక్షను ఎదుర్కొంటారని చెప్పారు. అలాగే అతున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తునానయన్నారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు బాధ్యతను హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించింది.
దీంతో ఎన్‌ఐఏ వెంటనే తన ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. ఘట నా స్థలికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపులు, సాక్ష్యాల సేకరణ, స్థానిక అధికారుల సమన్వయంతో అనుమానితుల కదలికలు, ఘటన వెనుక కుట్రను కనిపెట్టే చర్యలు చేపట్టింది.