calender_icon.png 28 January, 2026 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు మేడారంలో మెరుగైన సౌకర్యాలు

28-01-2026 12:00:00 AM

మేడారం జనవరి 27 (విజయక్రాంతి): మేడారం  సమ్మక్క సారలమ్మ జాతరలో దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పన కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భం గా వనదేవతల దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన క్యూ లైన్లు, షెడ్డును మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యా ణి,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇర్ప సుకన్య అధికారులు పాల్గొన్నారు.