24-12-2025 01:52:09 AM
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): రాష్ర్ట ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాలలోపు బహిర్గతం చే యాలని, పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని హైకో ర్టు ఇచ్చిన తీర్పు ప్రజాప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీమంత్రి హరీశ్‌రావు మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్‌రెడ్డి, చీకటి జీవోల మాటున నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి.
ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జీవోలు దాస్తూ చేస్తున్న డ్రామా’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీ ఐ సమాధానం ఆధారంగా తమ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టు లో పిల్‌తో జీవోల రహస్యం బట్టబయలు కాబోతున్నదని పేర్కొన్నారు. 07 నుంచి 26 వరకు మొత్తం 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.