calender_icon.png 20 November, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెల ప్రగతి: ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

20-11-2025 12:00:00 AM

మానకొండూరు, నవంబర్ 19 (విజయ క్రాంతి):ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామా లు ప్రగతి సాధిస్తాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు.గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మానకొండూర్ మండలం శం షాబాద్ లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజ లు పాలుపంచు కోవాలని సూచించారు. అభివృద్ధి పనులపై ప్రజలు దృష్టి సారించినప్పుడే పనుల్లో నాణ్యత పెరుగుతుందన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే పనులపై ప్రజలు నిరాసక్తత చూపకూడదని ఆయన సూచించారు. సొంత భవనా లు లేని పంచాయతీలకు, అలాగే నూతన పంచాయతీలకు భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని ఆయన చెప్పారు.

అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్  ప్రభుత్వం పని చేస్తున్నదని, ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నదని ఆయన పేర్కొన్నారు.భూమిపూజలుమానకొండూర్ మండలం వన్నా రం, గట్టుదుద్దెనపల్లి గ్రామా ల్లో పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ క వ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశా రు.

ఈ కార్యక్రమాలలో మానకొండూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరలక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రామిడి శ్రీనివాస్ రెడ్డి,ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కోండ్ర సురేష్, మడుపు ప్రేమ్ కుమార్, పెంచాల రాజయ్య,

ఆకుల నర్సింగరావు, కనుకం కుమార్, నీరడి మొగి లి, పెంచాల రంగయ్య, నాగపురి తిరుమల, కనకం సమ్మయ్య, బాకారపు సమ్మయ్య, బాకారపు రమేశ్, చెలిగంటి ఓదెలు, తాళ్లపల్లి శ్రీకాంత్, తాళ్లపల్లి కొమురయ్య, బనుక తిరుపతి, బాకారపు సంపత్, కనకం లచ్చయ్య, ఆనంద్, కవిత, ప్రసూన, పోలాడి రామారావు, గొల్లెన కొమురయ్య, తమిశెట్టి రాజేశ్, సాయిరి దేవయ్య, దుడ్డెల కుమార్ తదితరులుపాల్గొన్నారు.