calender_icon.png 31 December, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

31-12-2025 01:02:02 AM

బాల కార్మిక వ్యవస్థపై జీరో టాలరెన్స్ విధానం అమలు

చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చెపిస్తే క్రిమినల్ కేసులు తప్పవు

జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్త్మ్రల్ కార్యక్రమం

ఎస్సిపిసిఆర్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన

జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 30 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆపరే షన్ స్త్మ్రల్ కార్యక్రమంపై వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర బాల ల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెళ్లి చందన.జిల్లాలో జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్త్మ్రల్ కా ర్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ, బా ల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురా లు మర్రిపెళ్లి చందన అన్నారు.ఈ సందర్భంగా చందన  మాట్లాడుతూ.చిన్న పిల్లల తో వెట్టిచాకిరి చేయించడం,పనులలో పెట్టుకోవడం నేరమని,అలా చేస్తే సంబంధిత య జమానులపై క్రిమినల్ కేసులు తప్పవని హె చ్చరించారు.

బాల కార్మిక వ్యవస్థపై ప్రభు త్వం జీరో టాలరెన్స్ విధానంను కఠినంగా అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే చైల్ హెల్ప్ లైన్ 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజల ను కోరారు. ప్రజల సహకారంతోనే బాలల రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.అదేవిధంగా రానున్న రోజుల్లో మళ్లీ ఈ పిల్లలు బా ల కార్మికులుగా మారకుండా వారికి పునరావాస కార్యక్రమాలు చేపట విధంగా ప్రణా ళికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత వివిధ శాఖల అధికారులపై వుందని, బాల కార్మిక రహిత సమాజమే మనందరి లక్ష్యం పనిచేయాలని తెలియజేసారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, బాల కార్మికులపై ఫిర్యాదులు అం దిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.జనవరి 1 వతేది నుండి 31వ తేదీ వరకు జరిగే ఆపరేషన్ స్త్మ్రల్ కార్యక్రమానికి అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో జిల్లా లో సిరిసిల్ల, వేములవాడ డివిజన్ లలో ఎస్.ఐ స్థాయి అధికారి వివిధ శాఖల అధికారులతో రెండు టీమ్ లు ఏర్పాటు చేసి జిల్లా లో పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు,హోటల్స్,వ్యాపార సముదాయాలు, గోదాములు,మెకానిక్ షాపులు, హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతా ల్లో విస్తృతంగా తనిఖీలునిర్వహించడం జరుగుతుందన్నారు.

స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిం చి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 18సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయుస్తున్న వారిపై 2025 సంవత్సరంలో నిర్వహించిన ఆపరేషన్ స్త్మ్రల్, ముస్కాన్ లో 22 మందిపై క్రిమినల్ కేసులు చేసి 129 సంరక్షించడం జరిగిందని ఈసందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డీ డబ్ల్యూఓ లక్ష్మీరాజాం, సి డ బ్ల్యూ సి. చైర్పర్సన్ అంజయ్య, ఎస్.ఐ లు,వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..