31-12-2025 01:00:33 AM
ఆదిలాబాద్/ఉట్నూర్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఆదివాసుల ఆరాధ్యదైవం నాగోబా జాతరలో మహా ఘట్టమైన గంగనీళ్ల సేకరణ కోసం మెస్రం వంశీయులు పాదయాత్రగా పయనమయ్యారు. జనవరి 18న చేపట్టే మహాపూజల నేపథ్యంలో నాగోబా అభిషేకాని కి అవసరమయ్యే గంగాజలం కోసం మెస్రం వంశీయుల మంగళవారం మహా పాదయాత్ర ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని మురారి ఆలయంలో నాగోబా దేవుడికి ప్రత్యేక పూజ చేశారు.
గంగాజలం కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెస్రం వంశం పటే ల్ వెంకట్రావు, చిన్ను పటేల్, బాధిరావుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత గంగాజలం కోసం మహా పాదయాత్రకు శ్రీకా రం చుట్టారు. మంచిర్యాల జిల్లా జన్నారం మం డలంలోని కలమడుగు శివారులో ప్రవహించే గోదావరి నది నుంచి పవిత్ర గంగా జలాన్ని జనవరి 7న సేకరించుటకు నిర్ణయించారు.
ఇంద్రవెల్లి మీదుగా పాదయాత్ర
కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి, తిరిగి రావడం కలుపుకొని సుమారు 300 కిలోమీటర్లు మేర ప్రయాణిస్తా రు. ఈ యాత్ర ఇంద్రవెల్లి మండలం మీదుగా నార్నూర్, కుమ్రంభీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల మీదు గా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇస్లాపూర్ మీదుగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని నర్సింగాపూర్ నుంచి జన్నారం మండలంలోని కలమడుగు శివారులోని గోదావరికి చేరే విధంగా పాదయాత్ర నిర్ణయించారు.
మంగళవారం ప్రారంభమైన మెస్రం వంశీయు ల పాదయాత్ర జనవరి 7వ తేదీకి గోదావరి నదికి చేరుకుంటుంది. అనంతరం పవిత్ర గంగా జలాన్ని సేకరించి ఆలయానికి తిరుగు పాదయాత్రను ప్రారంభిస్తారు. జనవరి 14వ తేదీ వరకు కేస్లాపూర్ సమీప ప్రాంతానికి చేరుకుంటారు. మూడు రోజులపాటు మర్రి చెట్ల కింద తమ సాంప్రదాయ పూజలు నిర్వహిస్తు అక్కడే బసచేస్తారు. అనంతరం 18వ తేదీన నాగోబాకు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుంది.
జాతరకు ఏర్పాట్లు చేయాలి
ఏర్పాట్లపై ఎస్పీ, టీడీఏపీవోతో కలెక్టర్ రాజర్షి షా సమీక్ష
కేస్లాపూర్ నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగో బా దేవాలయం దర్బార్ సమావేశ మందిరంలో జాతర ముందస్తు ఏర్పాట్లపై ఎస్పీ అఖిల్ మహజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కలెక్టర్, ఎస్పీ, పీఓలు నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల తో కలిసి నాగోబాను దర్శించుకుని, పూజలు నిర్వహించారు.
అనంతరం జాతరప్రాంగ ణం, దర్బార్, కోనేరు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జనవరి 18న మహా పూజతో నాగోబా జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. భక్తులకు అవసరమైన వసతులు కల్పించాలని, దర్శనంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తదుపరి సమీక్షా సమావేశంలోగాఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆలయ పరిసరాల్లో హైమాస్ట్ విద్యుత్ దీపాలు అమర్చాలని, ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లు, తాగునీటి సౌక ర్యం, టాయిలెట్లు, అత్యవసర వసతులకు సంబంధించిన పనులను యుద్ధప్రా తిపదికన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, శిక్షణ ఐపీఎస్ రాహుల్ పంత్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.