10-09-2025 12:00:00 AM
మాళవిక మోహనన్ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్దం దాటింది. అయినా ఇప్పటిదాకా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఖాతాలో పడలేదు. దీంతో ఈ బ్యూటీ కెరీర్ అంతంతమాత్రంగానే ముందుకు సాగుతోంది. నిరుడు ఈమె డీగ్లామర్ రోల్ పోషించిన ‘తంగలాన్’ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఇటీవల మలయాళ చిత్రం ‘హృదయపూర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ‘రాజాసాబ్’ ఒక్కటే చెప్పుకోదగ్గది.
ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కాగా మాళవిక షూటింగ్ పూర్తయ్యింది. తమిళనాట ఈ అమ్మడికి ఉన్న క్రేజ్‌ను బట్టి అక్కడ వరుస సినిమాలు వస్తాయని భావించారు. కానీ పెద్దగా ఆఫర్లు వస్తున్నట్టుగా లేదు. కార్తీ ‘సర్దార్2’లో నటిస్తున్నప్పటికీ మాళవిక పాత్రకు ఏ మేరకు ప్రాధాన్యత ఉందనే క్లారిటీ లేదు. ‘రాజాసాబ్’ విడుదలకు ముందే తమ సినిమాలో నటించాలని తెలుగు మేకర్స్ మాళవికను సంప్రదించారట. కానీ ఇప్పటివరకు ఏ చిత్రానికీ ఓకే చెప్పలేదట. అయితే, ‘రాజాసాబ్’ తర్వాత టాలీవుడ్‌లో తన క్రేజ్ అమాతం పెరగడం ఖాయం అంటున్నారు. దీన్ని నిజం చేయాల్సిన బాధ్యత ‘రాజాసాబ్’పైనే ఉంది.