calender_icon.png 11 September, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ వార్తలన్నీ అబద్ధం

10-09-2025 12:00:00 AM

హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు యాక్సిడెంట్ అయిందని, పరిస్థితి విషమంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన అభిమానులు కొందరు ఈ వార్తలను కాజల్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన ఆమె వార్తలను ఖండించారు. తాను క్షేమంగానే ఉన్నానని ఓ నోట్ విడుదల చేసింది.

“నేను ప్రమాదంలో ఉన్నానని, ఇక తాను లేనని కూడా వార్తలు రావడం నా దృష్టికి వచ్చింది. అవి చూసి నేను నవ్వుకున్నా. ఎందుకంటే ఇంతకుమించిన ఫన్నీ న్యూస్ ఉండదు. అవన్నీ పూర్తి అవాస్తవం. దేవుడి దయవల్ల నేను క్షేమంగా ఉన్నా. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను షేర్ చేసే బదులు నిజమైన వార్తలేవైనా నలుగురితో పంచుకోండి” అంటూ నోట్‌లో పేర్కొంది. కాజల్ ప్రస్తుతం ‘ఇండియన్3’లో నటిస్తోంది. ‘రామాయణ’లోనూ నటించనుందని సమాచారం.