23-09-2025 12:19:19 AM
రిషబ్ శెట్టి కథానాయకుడిగా హోంబాలే ఫిల్మ్స్ రూపొందించిన ‘కాంతార’ చిత్రం 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోంది ‘కాంతార: చాప్టర్1’. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను స్టార్ హీరో ప్రభాస్ సోమవారం విడుదల చేశారు. ‘నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు?’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.
‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. ధర్మాన్ని కాపాడ్డానికి ఆ ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో’ అనే డైలాగ్ కాంతారా కథాంశాన్ని తెలియజేసింది. రిషబ్‌శెట్టి తనదైన నటనతో అదరగొట్టారు. యాక్షన్ సన్నివేశాల్లో మరోస్థాయిలో కనిపించారాయన. యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ అందంగా కనిపించింది. ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.