calender_icon.png 23 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ బయోపిక్ హీరో లుక్ ఇదే

23-09-2025 12:17:36 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ‘మా వందే’ పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ మోదీ జీవిత విశేషాలతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు క్రాంతికుమార్ సీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్‌రెడ్డి ఎం నిర్మిస్తున్నారు.

సోమవారం హీరో ఉన్ని ముకుందన్ పుట్టినరోజు. ఈ సందర్భం గా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మోదీ పాత్రలో ఉన్ని ముకుందన్ లుక్ ఆకట్టుకుంటోంది. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్‌ఎక్స్ వంటి అంతర్జాతీయ ప్రమాణా లతో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండి యా భాషలతోపాటు ఇంగ్లీష్‌లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రుర్; డీవోపీ: కేకే సెంథిల్‌కుమార్; యాక్షన్: కింగ్ సోలొమన్; ఎడిటిం గ్: శ్రీకర్ ప్రసాద్; ఆర్ట్: సాబు సిరిల్; నిర్మాత: వీర్‌రెడ్డి ఎం; రచనాదర్శకత్వం: క్రాంతికుమార్ సీహెచ్.