calender_icon.png 29 November, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొత్తులు.. ఎత్తులపైనే అందరిచూపు

29-11-2025 12:06:14 AM

- ఆరు గ్యారంటీ లు కలిసిస్తోయనే అధికార పార్టీ ధీమా

- పట్టు కోసం ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలు

-కొన్ని స్థానాల్లో కలిసి పోతున్న అధికార,ప్రతిపక్ష పార్టీలు

రంగారెడ్డి, నవంబర్ 28(విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల పోరు పల్లెల్లో రసవత్తరంగా నడుస్తుంది. సర్పం పీఠం స్థానం కోసం  అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తుండగా.... అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం గెలుపు గుర్రాలను  స్థానిక బరిలో నిలబెట్టేలా ఎత్తుగడలు వేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆయా పార్టీల నేతల మధ్య  నువ్వా నేనా? అన్నట్టుగా రాజకీయ వేడి మొదలైంది.

 వచ్చే  అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మరింత పటిష్టం కావాలంటే స్థానిక ఎన్నికలే అన్ని పార్టీలకు కీలకం. అధికార పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ఓటర్లకు వివరించి సర్పం స్థానాలను ధీమా వ్యక్తం చేస్తుండగా... మరోపక్క  టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలో గత రెండేళ్లలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆర్గారంటీలు... అమలు చేయడంలో విఫలం పాలైందని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి... తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని అధికార పార్టీకి సవాలు విసిరాలనే.... కసితో స్థానిక పోరుపై దృష్టి సారించారు. జిల్లా లో కొన్ని స్థానాలలో రాజకీయ పరిస్థితులను బట్టి, ఆయా పార్టీ ల బలబలాలను అంచనాలు వేస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం కలిసిపోతుండడం గమనారం. జిల్లాలో 526 పంచాయతీలకు మూడు విడుత లో ఎన్నికలు జరుగుతుండగా ఆయా విడుత ల పంచాయతీల పైన పార్టీల నేతలు ప్రధానంగా దృష్టి సారించారు.

ఉనికిని కాపాడుకునేందుకు....

 ప్రతిపక్ష పార్టీ  బీఆర్‌ఎస్, బీజేపీ కి  స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2023 లో అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారం కోల్పోయి, ఎంపీ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కించుకోలేకపోవడంతో... బీఆర్‌ఎస్ పార్టీలో కొంత తీవ్ర నైరాశ్యం పెరిగింది. రెండు దపాలు అధికార పార్టీ ఉండటంతో  స్థానిక ఎన్నికలు బీ ఆర్‌ఎస్ కు కలిసి వచ్చింది. ఈదపా పార్టీ అధికారం కోల్పోవడంతో స్థానిక ఎన్నికల్లో గట్టెక్కే అంశంపై నేతలు దృష్టి సారించారు. కానీ కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇదే తమకు కలిసాస్తుందనే ధీమా నాయకులో నెలకొంది.

బీజేపీ పార్టీ  తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పార్టీ స్థానికంగా బలంగా ఉండాలని.... అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చని.... పార్టీ నేతలు మెజార్టీ అభిప్రా యానికి వచ్చారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతల కు  దిశా నిర్దేశం చేస్తున్నారు. సర్పం,వార్డు స్థానాలకు మెజార్టీగా అభ్యర్థులను గెలిపించుకోవాలని  ఆ పార్టీ నేతలు సైతం తమ అభ్యర్థులను బరిలో నింపుతున్నారు. దీంతో ఆయా గ్రామాలలో స్థానిక పోరు త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీంతో పల్లెల్లో ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కసరత్తులు ప్రారంభించారు.