calender_icon.png 29 November, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనూ.. సీఎం త్వరలో ఢిల్లీకి!

29-11-2025 12:36:18 AM

-పెండింగ్ పనుల కోసం నేనెళ్తా

-సీఎం సైతం వచ్చే ఛాన్స్ 

-కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శిశకుమార్

-డీకేను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన సిద్ధరామయ్య

బెంగళూరు, నవంబర్ 28: నేను త్వరలో ఢిల్లీకి వెళ్తానని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటకలో సీఎం మార్పుపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య నడుస్తున్న మాటల యుద్ధం తతంగం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో శుక్రవారం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసు కుంది. డీకే శివకుమార్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలను సీఎం సిద్ధరామయ్య ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వారిద్దరూ అంగన్‌వాడీ 50 సంవత్సరాల వేడుకలో వేదికను పంచుకున్నారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కొత్తపథ కాలను ప్రారంభించి, గృహలక్ష్మి సహకార యాప్‌ను ఆవిష్కరించిన ప్యాలెస్ గ్రౌండ్ కార్యక్రమంలో ఇద్దరు నాయకులు కలిసి కన్పించారు. ఇద్దరు అగ్రనేతలు పక్కపక్కన కన్పిండంతో కాంగ్రెస్ పార్టీలో సఖ్యత చాటేందకు యత్నించినట్లు తెలుస్తుంది. మరోవైపు డీకే శివకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. తనకు ఉన్న కొన్ని పెండింగ్ పనుల కోసం త్వరలో ఢిల్లీ వెళ్లే అవసరం ఉందన్నారు. సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంలో సీఎం మారనున్నారా? డీకే సీఎం కానున్నారా? లేక ఎప్పటిలానే హైకమాండ్ ఎదుట డీకే శివకుమార్ తలూపుతారా? అనే సందేహాలు అందరిలో ఉత్కంఠను పెంచుతు న్నాయి. కాగా, సీఎం శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎంను శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించడం ఉత్కంఠ రేపుతున్నది.