calender_icon.png 29 November, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వీప దేశంపై దిత్వా పంజా

29-11-2025 12:39:37 AM

-శ్రీలంకలో తుఫాను బీభత్సం

-వరదల్లో గల్లంతై, కొండచరియలు విరిగిపడి 60 మందికి పైగా మృతి

-12,313 కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం

-పొరుగు దేశానికి భారత్ అత్యవసర సాయం

-ప్రత్యేక విమానంలో ఎమర్జెన్సీ సామగ్రి సరఫరా

-భారత్ అన్ని విధాలా అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

కొలంబో/న్యూఢిల్లీ, నవంబర్ 28: శ్రీలంకను ‘దిత్వా’ తుఫాను అతలాకుతలం చేసిం ది. ద్వీప దేశంలో తుఫాను బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారజాము నుంచి గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగం తో బలమైన గాలులు వీచాయి. అతి భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. జనావాసాల్లోకి వచ్చి గల్లంతై, కొండచరియలు విరిగిపడి సుమారు 60 మందికి పైగా మరణించారు. 20 మందికిపైగా గల్లంతయ్యారు.

600కు పైగా ఇళ్లు దెబ్బతిన్నా యి. తుఫాను ప్రభావంతో దేశవ్యాప్తంగా 12,313 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా యావత్ దేశం స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు.. అన్నీ మూతపడ్డా యి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, సహాయక చర్యల కోసం శ్రీలంక ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. తుఫాను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతున్నది. శనివారం నాటికి తుఫాను తమిళనాడు, పుదు చ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపనుంది.

తమిళనాడుపై ప్రభావం

దిత్వా తుఫాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిపై పడనుంది. ఆయా ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం న మోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. డిసెంబర్ 2వరకు ఈ ప్రభావం ఉంటుంది. దీంతో దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆయా ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తిరువారూరు, నాగపట్నం, మైలాడుతురై, కడలూ రు, విలుప్పురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. అలాగే ఆదివారం చెన్ను, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ పైనా..

దిత్వా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా పడనుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయల సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శని, ఆదివారాల్లో కుంభవృష్టి కురి సే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదివారం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. డిసెంబర్ 1 వరకు ప్రకాశం, బాపట్ల, గుం టూరు, కృష్ణా జిల్లాల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సముద్ర తీరాల్లో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున, కృష్ణపట్నం, మచిలీపట్నం వంటి ఓడరేవుల వద్ద హెచ్చరికలు జారీ అయ్యాయి. 

భారత్ అత్యవసర సాయం

శ్రీలంకలో తుఫాను బీభత్సం, 60మంది మృతిచెందడంపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశా రు. కష్టసమయంలో ఆ దేశాన్ని ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన ‘ఆప రేషన్ సాగర్ బంధు’ పేరిట అత్యవసర సామగ్రిని సిద్ధం చేయించి, భార త సైన్యం  ద్వారా కొలంబోకు చేరవేశారు. అలాగే అక్కడి ప్రభుత్వం సహా యక చర్యలకు వినియోగించుకునేందకు ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ జెట్ పం పించాలని శ్రీలంక రక్షణ అధికారులు భారత్‌ను అభ్యర్థించగా, మన ప్రభు త్వం అందుకు సానుకూలంగా స్పందించింది.

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం 145 మందికిపైగా మృతి

బ్యాంకాక్, నవంబర్ 28: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు థాయ్‌లాండ్ అతలాకుతలమైంది. వరద బీభత్సం కారణంగా ఇప్పటివరకు 145 మంది మృతిచెందారు. దేశంలోని దక్షిణ ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కుగా ఉంది. వరదల కారణంగా ప్రత్యక్షంగా 12 లక్షలకు పైగా కుటుంబాలు ప్రభావితమమయ్యాయి. వరదలు ఇప్పుడిప్పుడే  తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అక్కడి యంత్రాంగం, సైన్యం సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సోంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లో నష్ట తీవ్రత ఎక్కువగా నమోదైంది. వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్డు మార్గాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం.. వరదల్లో గల్లంతై ఈ ఒక్క ప్రాంతంలోనే 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మూడు రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో 630 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. వరదల ధాటికి హాట్ యాయ్ నగరంలోనే సుమారు 16 వేల మందికి పైగా పౌరులు చిక్కుకుపోయారు. వారందరినీ సైన్యం 16 పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద సహాయక చర్యల కోసం థాయ్‌లాండ్ ప్రభుత్వం 4.75 బిలియన్ బాట్ల గ్రాంట్ విడుదల చేసింది. యుద్ధప్రాతిపదికన ఎనిమిది తాత్కాలిక ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేసింది.