29-11-2025 12:09:19 AM
హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్(టీఎన్‌జీవో) ఆధ్వర్యంలో శుక్రవారం యూనియన్ ప్రాంగణంలో మహా త్మా జ్యోతిరావు గోవిందరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా పలువురు యూనియన్ నేతలు, ఉద్యోగులు తదితరులు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని(ముజీబ్) హాజరై మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం రద్దు కోసం చేసిన కృషి అనిర్వచనీయమన్నా రు. మహిళల విద్యకు, అణగారిన వర్గాల ప్ర జల విద్యాభివృద్ధికి పూలే దంపతులు చేసిన సేవలు భారతీయ సమాజానికి మార్గదర్శకులన్నారు.
టీఎన్‌జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌కుమార్ మాట్లాడుతూ పూలే ఆశయాల స్ఫూర్తితోనే సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించగలమన్నారు. టీఎన్‌జీ వో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి వెనుక బడిన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించడంలో పూలే పాత్ర అద్వితీయమైనదన్నారు.
కార్యక్రమంలో కేఆర్ రాజ్ కుమార్ (జిల్లా అసో సియేట్ ప్రెసిడెంట్), శంకర్ (వైస్ ప్రెసిడెం ట్, ఈఎన్‌టీ హాస్పిటల్), రాజు(వైస్ ప్రెసిడెం ట్, ఈఎస్‌ఐ హాస్పిటల్),ప్రశాంత్ (సర్వేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు), సుదర్శన్ గౌడ్ (కమ ర్షియల్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్), మహమ్మద్ వాహీద్ (ఏపీఆర్‌ఓ ప్రతినిధి), మహమ్మద్ ముస్తఫా, ఉస్మానీ అలీ ఉస్మానీ, రామకృష్ణ తదితరులున్నారు.