18-09-2025 12:00:00 AM
-సీఎంను కలిసిన విన్నవించిన ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసిన ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం తదితర వాటిపై సీఎం విన్నవించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో అనేక రహదారులు దెబ్బతిన్నాయని వాటి మరమ్మతుల తో పాటు పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో 5,576 మంది రైతులు 8,566 ఎకరాల్లో పంటలు నష్టపోయారని, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. విన్నవించినా అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.