calender_icon.png 18 September, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి

18-09-2025 12:00:00 AM

-ప్రతి మహిళను ఆరోగ్యంగా ఉంచడమే కేంద్రం లక్ష్యం

-స్వస్ట్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ నగేష్

అదిలాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి):  మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, అద్వారా దేశం సైతం ఆరోగ్యవంతమవుతోందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు  చేపట్టిన స్వస్ట్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. స్థానిక హమాలివాడ అర్బన్ హెల్త్ సెంటర్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం గర్భిణీలకు, మహిళలకు వైద్య పరీక్షలు చేపట్టారు. అదేవిధంగా పేదలకు ఫుడ్ కిడ్స్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజం ఉంటేనే అందరూ అన్ని రంగాల్లో రాణించవచ్చని అన్నారు. జనాభాలో సగభాగమైన మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉండే ఆస్కారం ఉంటుందన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్ర మాలు చేపడుతుందని గుర్తు చేశారు.   

అంతకుముందు కలెక్టర్ రాజర్షి షా  మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 91 స్పెషల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనికోసం రీమ్స్, ఐఎంఏ ఆధ్వర్యంలో స్పెషలిస్టు డాక్టర్లు వైద్య పరీక్షలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత, ఐరిస్క్ ప్రెగ్నెన్సీ, సైకియార్జిస్ట్ ఇలా అనేక  పరీక్షలు చేసి ఉచితంగా మందులు గోళీలు అందించడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఐఎంఏ నుండి డాక్టర్ రమ సత్యనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.