09-07-2025 05:53:54 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): వార్డు తారకరామ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం ఇంటి నంబర్లను కేటాయించారు. ఆర్కేసి ఓఏ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో లాటరీ పద్దతి ద్వారా గతంలో ఎంపిక చేసిన 230 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లను కేటాయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్(Tahsildar Satish) మాట్లాడుతూ... డబుల్ బెడ్ ఇంటి నంబర్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా అధికారుల సమక్షంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో వికలాంగులకు 13 ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. త్వరలో డబుల్ బెడ్‌రూంలను సంబంధించిన మౌళిక వసతులు పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇంటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామని తెలిపారు. కాగా ఇంటి నంబర్లను లబ్ధిదారులకు కేటాయింపు ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకు సింగరేణి ఆర్కే సిఓఏ క్లబ్ లో బయటే ఎంపిక చేసిన వారి పత్రాలను పరిశీలించి కేవలం లబ్ధిదారులను మాత్రమే అనుమతించారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్ గద్దె రాజు, ఏసీపీ రవి, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, ఆర్ఐ గణపతి తదితరులు పాల్గొన్నారు.