26-09-2025 12:36:47 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏ-1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రాసెక్యూషన్ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇవ్వాల్సింది గా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినట్టు తెలిసింది. ఫార్ములా ఈకారు రేసు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ..
తమ దర్యాప్తు పూర్తయిందని, కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరు తూ ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆ లేఖను, ఏసీబీ రిపోర్టును విజిలెన్స్ కమిషనర్‌కు పంపించింది. ఏసీబీ రిపోర్టును పరిశీలించిన విజిలెన్స్ కమిషనర్ నిందితులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టవచ్చని క్లియరెన్స్ ఇచ్చారు.
కేటీఆర్‌పై ప్రాసి క్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి అవసరమైనందున, విజిలెన్స్ సిఫారసుతోపాటు ఏసీబీ నివేదికను గవర్నర్‌కు సీఎస్ పంపించారు. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ బుధ వారం న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కోరినట్టు తెలుస్తోంది. వారి అభిప్రాయం అందిన తర్వాత కేటీఆర్ ప్రాసిక్యూషన్‌పై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.