26-09-2025 12:36:23 AM
తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాం తి): ఎస్టీ జాబితా నుంచి లంబాడా లను తొలగించాలని జిల్లాలో ఆదివాసీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు కోరిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కోర్టుకు అందజేసి, ఆదివాసీల పక్షాన నిలబడాలని జిల్లా వ్యాప్తంగా మహా పాదయాత్ర లుఖ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), పంచాయతీ రాయి సెంటర్, 9 తెగల సంఘాల ఆధ్వర్యంలో తలమడుగు మండల కేంద్రంలో మహా పాదయాత్ర చేపట్టారు.
స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తాహసిల్దార్ కార్యాలయం వరకు భారీ వర్షం లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు అందరు ఆదివాసి పక్షాన నిలబడి ఆదివాసులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.
అక్రమంగా వలసవచ్చిన లంబాడాలతో అమాయకమైన ఆది వాసీల విద్యా, ఉద్యోగం రాజకీయం, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోడప నగేష్, పుర్క బాపురావ్, ఆది వాసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెందోర్ పుష్ప రాణి, జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక బాయి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర బాయి తో పాటు పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు.