19-07-2025 02:09:58 AM
ప్రభుత్వానికి పెన్షనర్ల జేఏసీ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తమతో చర్చించేందుకు సమయమివ్వాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కే.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరా రు. శుక్రవారం కమిటీ కార్యాలయం లో జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు.
ఇటీవల ప్రభుత్వం తమ తో జరిపిన చర్చల్లో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని తెలిపారు. పెన్షనర్ల సమస్యలను పట్టిం చుకోవడంలేదని, తాము మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మందిని ప్రభావితం చేయగలమని పేర్కొన్నా రు. తమ సమస్యలను పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.