29-01-2026 01:15:33 AM
ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ బాక్సా ఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది. అయితే, ‘కల్కి 2’పై గురించి నెట్టింట ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. తొలిభాగంలో ‘సుమతి’గా కీలక పాత్ర పోషించిన దీపికా పడుకొణె పాత్రకు సీక్వెల్‌లో ముగింపు పలికి, ఆ పాత్రలో ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారట దర్శకుడు నాగ్ అశ్విన్.
ఈ క్రమంలోనే అందాల తార సాయిపల్లవిని ఈ భారీ ప్రాజెక్టులోకి తీసుకునే యోచనలో ఉన్నారట. తన సహజ నటనతో ఎలాంటి సెంటిమెంట్ సీన్స్ అయినా పండిచగల సాయిపల్లవి భాగమైతే.. సినిమాకు కలిసివస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. దీపికా పాత్ర ముగిసిన తర్వాత వచ్చే మలుపులో సాయిపల్లవి ఎంట్రీ ఉంటుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
ప్రభాస్ కాంబోపై అత్యంత విశ్వాసంతో ఉన్న అభిమానుల్లో, తాజాగా సాయిపల్లవి పేరు వినిపిస్తుండటంతో అంచనాలు మరోస్థాయికి చేరాయి. ప్రభాస్, సాయిపల్లవి కలయికలో రానున్న తొలిచిత్రం కావడంతో తెరపై వీరి కెమిస్ట్రీని చూసేందుకు అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి అభిమానులు ఆశపడుతున్నట్టు ప్రభాస్ సరసన కథానాయికగా సాయిపల్లవిని చూసే భాగ్యం కలుగుతుందా.. లేదా..? తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.