calender_icon.png 6 December, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ పరీక్ష

06-12-2025 07:11:20 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఈనెల 14వన అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో 3 నుండి 10 తరగతి  సీబీఎస్ఈ-స్టేట్-ఐసిఎస్ఇ విద్యార్థులకు  "అమాట్"  పరీక్షను నిర్వహించడం జరుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు.  శనివారం నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో "అమాట్-2025" గోడ ప్రతి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 14న ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.5000, రూ.3000, రూ.2000 నగదు బహుమతులతో  పాటు జ్ఞాపికలను ప్రదానం  చేస్తామని తెలిపారు. విజేతలందరికీ ఈనెల 22న రామానుజన్ జయంతోత్సవాల్లో  అతిథుల చేతుల మీదుగా  బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆసక్తి గలవారు ఈనెల 12లోగా పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 92469 34441, 92469 34456, 9398230614 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.