06-12-2025 07:11:11 PM
హాజీపూర్ (విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం(KV)లో శనివారం గ్రాండ్‌పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తరాల మధ్య అనుబంధం పెంచడానికి, పరస్పర భావాల్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
విద్యార్థులు తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, అత్తమామలతో కలిసి వివిధ ఆటలు, గ్రూప్ యాక్టివిటీలు, సంగీత ప్రదర్శనలు, డాన్స్ కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆటలు, మ్యూజికల్ ఈవెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు తమ పెద్దలకు ప్రేమతో తయారు చేసిన కార్డులు, చిన్న బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజేపీటీబీఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.