calender_icon.png 10 November, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీతోనే బస్తీ బతుకుల్లో మార్పు

10-11-2025 12:21:42 AM

కమలానికి ఒక్క అవకాశం ఇవ్వండి

కేంద్రం సాయంతో జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తాం

బోరబండ డివిజన్ పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): బీజేపీతోనే బస్తీవాసుల బతుకుల్లో మార్పు వస్తుందని, కమలానికి ఒక్క ఛాన్స్ ఇస్తే కేంద్రం సాయంతో జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లను అభ్యర్థించారు. అదివారం బోరబండ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, ఇప్పుడు రెండేళ్లుగా కాంగ్రెస్ అధి కారంలో ఉన్నా బో రబండ రూపురేఖ లు మారలేదు.

మురుగు నీటి సమస్య, అధ్వాన్నమైన రోడ్లతో ప్రజలు నర కం చూస్తున్నారు. ఈ రెండు పార్టీలకు మీ ఓట్లు కావాలి తప్ప, మీ బాగోగులు పట్టవు’ అని విమర్శించారు. ‘కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా మీ బస్తీ అభివృద్ధికి అందుతాయి. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను’ అని ఆయన భరోసా ఇచ్చారు.