calender_icon.png 22 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

22-09-2025 12:22:23 AM

కోదాడ, సెప్టెంబర్ 21: చిన్ననాటి జ్ఞాపకాలు మరువలేనివని ఆనాటి రోజులను స్నేహితులు గుర్తుచేసుకొని ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడిగా గడిపారు. మఠంపల్లి వివేక వర్ధిని హైస్కూల్లో 1976-1977 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కోదాడ పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సందడిగా గడిపారు.

ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యతోపాటు నైతిక విలువలకు కట్టుబడి ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుందని అన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తు చేసుకొని నాడు ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణతోనే తాము ఉద్యోగాలు సాధించి వివిధ రంగాల్లో స్థిరపడ్డామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని సైదేశ్వరరావు, తాటికొండ కృష్ణారెడ్డి, కోటిరెడ్డి, తీగల చంద్రశేఖర్ రెడ్డి, తిప్పన వెంకటరెడ్డి, మధుసూదన్ రావు, సుధాకర్ రెడ్డి, వేణుగోపాలరావు, క్లైమేన్స్, పుష్ప,దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు.