calender_icon.png 22 September, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆరంభమైన బతుకమ్మ సంబురాలు

22-09-2025 12:22:29 AM

బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజ కార్యక్రమాలు 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జిల్లా అధికారుల సముదాయ భవ నం నందు బతుకమ్మ వేడుకలు అం గరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. జిల్లా పౌర సరఫరాల శాఖ,ఉ పాధి కల్పన శాఖ,డిస్ట్రిక్ట్  ఇన్ఫర్ మెటి క్స్ శాఖ,సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ శాఖ కు చెందిన మహిళా ఉద్యోగులు బతుకమ్మ పాటలకు పాడుతూ బతుకమ్మ ఆడడం జరిగింది.

నేడు పిల్లల మర్రి లో బతుకమ్మ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి లో సోమవారం  న జిల్లా యంత్రాంగం తరపున ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రదేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని  ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.