22-09-2025 12:21:17 AM
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): స్వతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం భద్రాచలం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోతున్న ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ బాపూజీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహా నాయకులని భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డ మహా నాయకుడు అని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడే అసెంబ్లీలో గొంతు వినిపించి మంత్రి పదవికి రాజీనామా చేసిన కమిట్మెంట్ నాయకుడు పేదల పెన్నిధి కొండా లక్ష్మణ్ బాపూజీ అని నివాళులర్పించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జాంగిర్, రాష్ట్ర సేవాదళ్ ఆర్గనైజర్ పిట్టల బాలరాజు ధర్మశాల కమిటీ చైర్మన్ మంచి కంటి కృష్ణమూర్తి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్, ఠాగూర్ ప్రకాష్, జితేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాచమల్ల రమేష్, చిన్నగారి బలరాం, అంజయ్య పాల్గొన్నారు.