calender_icon.png 18 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడవ విడత సర్పంచ్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

17-12-2025 12:00:00 AM

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, డిసెంబరు 16 (విజయ క్రాంతి): జిల్లాలో జరగనున్న మూడవ  విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని, ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

మూడవ విడతకి సంబంధించి జిల్లాలోని బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాలలో మొత్తం 119 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని, 45 రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్.ఐ లతో పెట్రోలింగ్ టీమ్స్ తో మొత్తం 853 మంది పోలీసు అధికారులు, సిబ్బందిచే ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేదుకు అన్నిరకాల పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని, విజయోత్సవ ర్యాలీలు, బాణసంచాలు కాల్చడం, బైక్ ర్యాలీలు, డీజే లు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.