06-10-2025 01:13:32 AM
నిజామాబాద్, అక్టోబర్5 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్ల నుండి బకాయిలు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అబద్ధపు చాలన్ల స్కాంపై పూర్తిగా దృష్టి సారించి నకిలీ చాలని విషయమై ప్రభుత్వానికి రావాల్సిన చెల్లింపులు వెంటనే జరిగేలా చూడాలని గత నెల 22 న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని పేరు ప్రఖ్యాతులుగాంచిన దశాబ్దాలుగా రైస్ మిల్లులు వ్యాపారం చేస్తున్న రైస్ మిల్లర్లు భారీ మొత్తంలో చలాన్లు చెల్లించకుండా చెక్కుల రూపంలో ఇచ్చి అవి బాంబ్స్ అయ్యేలా చేశారని ఆరోపణలు జిల్లాలో వస్తున్న నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సర్కిల్ వారీగా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖచ్చితమైన ఆదేశాలిచ్చి నకిలీ చాలాన్లు చెక్ బాక్సులు తాలూకు రికవరీలు ఆశించిన మేరకు రికవరీలో తాలూకు ఆస్తుల జప్తు జరగనట్టు తెలుస్తోంది. బోధన్ సర్కిల్లోని వాణిజ్య పనుల శాఖలో చెక్ బౌన్స్ తాలూకా చాలాన్లు డబ్బులను తిరిగి రాబట్టాలని వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన అవకతవకలపై పూర్తి సమీక్ష ను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యంగా బోధన్ చాలాన్ల విషయంలో ఆమె దృష్టి సారించి వాణిజ్య పనుల శాఖలో జరిగిన బకాయిల విషయమై చాలాన్ల విషయమై రికవరీలు వెంటనే చేయాలని సిబ్బందిని కోరినప్పటికిని రాజకీయ ఒత్తిడుల కారణంగా అధికారులు ఫలితాలను సాధించలేకపోయారు అన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో బోధన్ వాణిజ్య పనుల శాఖలో భారీ కుంభకోణం జరిగింది నకిలీ చలాన్ల కుంభకోణంలో బోధనలో ఓ ఇంటిలో గుట్టలుగా పట్టుబడ్డ నకిలీ చాలాన్ల విషయమై అందులోనుండి కొన్ని చాలాన్ ల ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు నిర్ధారణకు పంపించారు.
వాణిజ్య పన్నుల శాఖ 5500 చాదాలను ఫారెన్సీ శాఖకు పంపగా పంపిన పూర్తి 5,500 చాలాన్లు నకిలీవే అని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చేశారు. వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనపై సిఐడిచే ప్రభుత్వం విచారణ జరిపించింది. ఈ కుంభకోణం తాలూకు చాలాన్లను రికవరీ చేయాలని అవసరమైన చోట నకిలీ చాలాన్ల చెల్లింపు చేసిన వారి ఆస్తులను జప్తు చేసి రికవరీ చేయాలని వాణిజ్య పనుల శాఖ అధికారులను ఆ శాఖ కమిషనర్ హరిత ఆదేశించారు అయినప్పటికీ రికవరీలు ఆశించిన మేరకు జరగలేదు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆమె ఇటీవల సమావేశం జరిపి తక్షణమే పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. బకాయిలను చెల్లిస్తామని తమపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించోద్దని రైస్ మిల్లర్లు వేడుకొనగా ఆమె తగిన అవకాశం కల్పించారు. నెలరోజులు కావస్తున్నప్పటికిని రికవరీ ఆశించిన మేరకు జరగలేదు.
రైస్ మిల్లర్లు పెండింగ్ బకాయిలను చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకొని చెల్లింపులు జరిగేలా చూడాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు కొంతమంది పళ్ళు చెల్లింపుదారులు ఇచ్చిన చెక్కులు బ్యాంకుల్లో చల్లకుండా పోవడంతో చెక్కులు బౌన్స్ చేయడంతో ఈ విషయమై రాష్ట్ర కమిషనర్ హరిత సర్కిల్ వారిగా సమీక్ష నిర్వహించి రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు.
బోధన్ సర్కిల్లో జరిగిన చాలాన్ల కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది వాణిజ్య పనుల శాఖ నకిలీ చలాన్ల కుంభకోణంలో ఫారెన్సీ ల్యాబ్ పంపిన చాలాన్లు నకిలీవన్ తేలడంతో సిఐడిచే ప్రభుత్వం దర్యాప్తు జరిపించింది. బోధనలోని ఒక ఇంటిలో నీ గదిలో గుట్టలుగా నకలి చాలని చూసిన అధికారులు కంగుతిన్నారు. ఎన్ని చాలాన్లను గుర్తించడం కష్టమని అందులో నుండి సంవత్సరాల వారిగా తీసిన 5, 500 చాలాన్లు పోరెన్సీకి పంపారు.
పంపిన చాలని నకిలీవ్ అని తేలడంతో అధికారులు విశ్వాయానికి గురయ్యారు. బోధన్ వాణిజ్య పనుల శాఖలో దిమ్మతిరిగే మరిన్ని వాస్తవాలు బయటపడ్డాయి సర్కిల్ వారిగా కార్యాలయంలో అనేక అవతల జరిగినట్టు అధికారులు గుర్తించారు బోధన్ కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణంలో తలారి శివరాజ్ తో పాటు అదే శాఖలో పనిచేస్తున్న మరికొందరు అధికారులను సిఐడి అధికారులు అరెస్టు కూడా చేశారు.
గతంలో ఇదే కార్యాలయంలో పనిచేసే పదవి విరమణ చేసిన అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ కుంభకోణం బట్టబయలైంది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత గత సెప్టెంబర్ 22న జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ బకాయిలను వెంటనే రికవరీ చేయాలని ఆదేశించారు డివిజన్లోని అధికారుlu ముఖ్యమంత్రి ఆశాలకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందిస్తూ పని చేయాలని సిబ్బందిని ఆమె కోరారు.
రాష్ట్ర పన్నుల వివరాలు ఆదాయ లక్ష్య సాధన తో పాటు జీఎస్టీ పన్నుల రేట్లలో ఇటీవల జరిగిన మార్పులపై సమగ్ర సమీక్ష ను ఆమె నిర్వహించారు టాక్స్ ప్రాక్టీషనర్స్ తో సమావేశం నిర్వహించారు.
పలు సూచనలు కూడా చేశారు. నిజామాబాద్ జిల్లాలోని టాక్స్ ప్రాక్టీషనర్స్ కు సూచనలు జారీ చేస్తూ టాక్స్ రిటరన్స్ సమయానికి సక్రమంగా దాఖలు చేయాలని అలాగే జీఎస్టీ రేట్ల మార్పును పన్ను చెల్లింపుదారులకు సమాచారం తెలియజేసి వినియోగదారులకు ఆ ప్రయోజనాలు అందేలా చూడాలని ఆమె చార్టెడ్ అకౌంట్ టెక్స్ ప్రాక్టీస్ నర్స్ ఏర్పాటుచేసిన సమీక్షలో కోరారు.
నిజామాబాద్ జిల్లాలోని టాక్స్ ప్రాక్టీషనర్స్ కు సూచనలు జారీ చేస్తూ టాక్స్ రిటరన్స్ సమయానికి సక్రమంగా దాఖలు చేయాలని అలాగే జీఎస్టీ రేట్ల మార్పులను పన్నులు చెల్లింపుదారులకు సమాచారం తెలియజేసి తమ వ్యాపార ప్రాంగణాల్లో వ్యాపారులు జిఎస్టి రేటు తగ్గించిన వివరాలను తర్వాత ధరల వివరాలను బౌద్ధ రూపంలో ప్రదర్శించాలని కచ్చితంగా ఈ విధానం అమలయ్యే విధంగా చూడాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు.
వ్యాపారులు జీఎస్టీ రేట్లు తగ్గించిన వివరాలను ధరల వివరాలను బోర్డుల రూపంలో ఖచ్చితంగా తమ వ్యాపారాల వద్ద ఏర్పాటు చేయాలని ఆమె సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు కానీ కొందరు వ్యాపారులు ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తమ ఇష్టానుసారం నోటిమాటగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వ్యాపారులు రిటరన్స్ సక్రమంగా ఫైల్ చేయడం పన్నులు సమయానికి చెల్లించడం గురించి పన్నుల చెల్లింపుదారులకు మార్గ నిర్దేశం చేయాలని ఆమె టాక్స్ ప్లేయర్స్ ని కోరారు.