calender_icon.png 10 November, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా చండీయాగం..జలాధివాసం

10-11-2025 01:42:42 AM

ఘట్ కేసర్, నవంబర్ 9 (విజయక్రాంతి) : పోచారం మున్సిపల్ అన్నోజిగూడ లోని శ్రీ జగదాంబ మాత, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ఆదివారం రెండవరోజు జగదంబ మాత,  శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్  విగ్రహ ప్రాణ ప్రతిష్ట, చండీయాగం,  జాలాదివాసం పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలలో ఆలయ కమిటీ చైర్మన్ గుగులోత్ గోవింద్ నాయక్,  ఆలయ వైస్ చైర్మన్ విజయ్ సింగ్ నాయక్, ఆలయ ప్రెసిడెంట్ ఆంగోత్ సంతోష్ నాయక్, ప్రధాన కార్యదర్శి నానవత్ రాకేష్ నాయక్, ఆలయ ఉపాధ్యక్షులు విస్లావత్ రాము నాయక్, కోశాధికారి విస్లావత్ వినోద్, కార్య దర్శి నానవత్ రాజు నాయక్, దేవుసింగ్ నాయక్, ప్రశాంత్ నాయక్‌లు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఈ చండీయాగం, జలాధివాసం కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగింది. నానవత్ బిక్కు నాయక్, ననావత్ జితేందర్ రావు, ననావత్ రెడ్యానాయక్ డాక్టర్ ధరావత్ కిరణ్ కుమార్, ధరావత్ థౌర్య నాయక్, గుగులోత్ తారసింగ్ నాయక్, విస్లవత్ జగన్ నాయక్, ఆమ్గోత్ లక్ష్మణ్ నాయక్, నానవత్ రమేష్ నాయక్, విస్లావత్ రామసింగ్ నాయక్, విస్లావత్ లాలు నాయక్, విస్లావత్ రవి నాయక్, నానవత్ తారసింగ్ నాయక్, నానవత్ సంతోష్ నాయక్, విస్లావత్ రూప్ సింగ్ నాయక్, నానవత్ సీతరాం నాయక్, నానవత్ రాజు నాయక్, అన్నోజిగూడ లోని యావత్తు బంజారా ప్రజలు అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.