calender_icon.png 21 January, 2026 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

23-09-2024 01:20:25 AM

నిందితులను శిక్షించాలని దళిత సంఘాల ఆందోళన

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం బీమనపల్లిలోని అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్ర హం కుడి చేయి ధ్వంసం కావడంతో ఆదివారం ఎమ్మార్పీఎస్, వివిధ దళిత సంఘా లు ఆధ్వర్యంలో భువనగిరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి బీమనపల్లి గ్రామాన్ని సందర్శించి ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. దుండగులను గుర్తించి శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఆందోళనలో మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, నాయకులు ఈరపాక నర్సింహ, దర్గాయి హరిప్రసాద్, ఇటుకల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.