calender_icon.png 29 September, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అవసరం

28-09-2025 10:53:15 PM

అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు

గరిడేపల్లి (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుడు, ఆయన కొందరివాడు కాదు ఆయన అందరివాడని ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకొని ఆయనను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని జై భీమ్ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం ఆదివారం మండల కేంద్రమైన గరిడేపల్లిలో శంకుస్థాపన చేశారు. జై భీమ్ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఆయన రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మండల కేంద్రమైన గరిడేపల్లిలో విగ్రహ ఏర్పాటుకి అందరూ ఐక్యమత్యంగా కృషి చేయాలని వారు కోరారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కడియం స్వప్న, షెడ్యూల్ కులాల సంక్షేమ అధ్యక్షులు పిట్ట బాబు, మాజీ సర్పంచ్ తిరుపురం సీతారామరెడ్డి, భీమపంగు శ్రీనివాస్, బీసీ సంఘాల రాష్ట్ర కార్యదర్శి ధనంజయ నాయుడు, సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకూబ్, ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి ప్రసాద్, వివిధ సంఘాల నాయకులు, పిట్ట సైదులు, జిలకర రామస్వామి, రాపోలు నవీన్, ఇంజమూరి మల్లయ్య, పల్లె పంగు నాగరాజు, మేకపోతుల చంద్రయ్య, కీసర నాగయ్య, మాచర్ల రవి, శంబిరెడ్డి, పిట్ట గణేష్, నన్నెపంగా సైదులు, నకరికంటి సువార్త సైదులు, కుర్రి వెంకన్న, పిట్ట నరసయ్య, సాయి కిరణ్, నరసింహ, నాగరాజు, బిక్షం, పెద్ద ముత్తయ్య, సోములు, కాశయ్య, శ్రీను, మైసయ్య, శంకర్, వెంకటయ్య, పాపులు, గురవయ్య, రమేష్, వెంకన్న, మరియమ్మ, దశరథ్, రాములు, రవి, నాగరాజు, నాగార్జున, శేఖర్, విష్ణు, మైసయ్య, పవన్ తో పాటు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.