calender_icon.png 29 September, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ప్రయోజకులు అయితే తల్లిదండ్రులకు గర్వం

28-09-2025 10:48:47 PM

యంఈఓ గోపాల్ రావు 

మోతె (విజయక్రాంతి): పాఠశాలలో చదువుకొని ప్రయోజకులు అయితే చదువు చెప్పిన గురువులకు కన్నా తల్లిదండ్రులకు గర్వం ఉంటుందని యంఈఓ కె. గోపాల్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం గ్రామంలోని జిల్లా పరిష్యత్ ఉన్నత పాఠశాల 2006-07 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు చిన్నానాటి నుండి అక్షరాభ్యాసం మొదలుకొని ఉన్నత చదువులు చదివే వరకు ఇంట్లో తల్లిదండ్రులు బడిలో గురువులు చెప్పే ప్రతి విషయం జ్ఞానేంద్రియలను తమ అధీనంలో పెట్టుకొని క్రమ శిక్షణతో మెలగడంతో పాటు తమ వ్యక్తి గత జీవితానికి బాటలు వేసుకోవడం జరుగుతుందని గొప్ప వారుగా తీర్చిదిద్దబడుతారని తెలిపారు. అనంతరం విద్యను బోధించిన గురువులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.