29-09-2025 12:02:00 AM
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ పర్యవేక్షణలో బాలసముద్రంలోని పెట్ పార్క్ లో డాగ్స్ బ్రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ రేబిస్ దినోత్సవ వేడుకలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రేబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ,ప్రజలలో పశుప్రేమ, పశు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.
రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.