30-09-2025 12:00:00 AM
-18 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు టీ-చిప్‌తో ఒప్పందాలు
-ఐఐటీ హైదరాబాద్ తొలి స్వదేశీ చిప్ ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో శని, ఆదివారం జరిగిన టీ- సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. భారత్‌లో సెమీకండక్టర్ రంగ భవిష్య త్‌కు మార్గం చూపే ప్రణాళికల రూపకల్పనకు ఈ సదస్సు వేదికైంది. ఈ సందర్భంగా టాలెంట్, డిజైన్, మాన్యుఫాక్చరింగ్, అప్లికేషన్స్ వంటి అంశాల వ్యూహంతో సమగ్ర ఎకోసిస్టమ్ రూపొందించడానికి ప్రతిపాదనలను ఆమోదించా రు.
ఆరంభ సమావేశా నికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్, డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాశ్, మాజీ ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. తెలంగాణను భారత సెమీకండక్టర్ విప్లవానికి లాంచ్ ప్యాడ్‌గా నిలపాలన్న దృక్పథాన్ని వారు ఉటంకించారు. ఈ సమ్మిట్‌లో ఒక ప్రధాన ఆకర్షణగా 18 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు టీ-చిప్‌తో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ద్వారా విద్యార్థులకు చిప్ డిజైన్ ల్యాబ్స్, శిక్షణ కార్యక్రమాలు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, అంతర్జాతీయ పరిశోధనలో భాగస్వామ్యం కల్పించనున్నారు.
అంతర్జాతీయ స్థాయిలోనూ విశేష భాగస్వామ్యం లభించింది. నేషనల్ యాంగ్ మింగ్ చియావ్ టంగ్ యూనివర్సిటీ(ఎన్‌వైసీయూ), తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(టీఎస్‌ఆర్‌ఐ), ఏఆర్‌ఎం, జీఎస్‌యూ టెక్నాలజీ సీఈఓ సీ.సీ చాంగ్ తదితరులు పాల్గొని భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరించిన స్వదేశీ చిప్ భారత డిజైన్ సామర్థ్యాలకు మైలురాయిగా నిలిచింది. టీతచిప్ చైర్మన్ సందీప్‌కుమార్ మక్తాలా మాట్లాడుతూ... ఐఐటీ హైదరాబాద్ తొలి చిప్‌ను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు.