29-08-2024 04:36:59 AM
ఎల్బీనగర్, ఆగస్టు 28: నాగోల్ పరిధిలోని లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన నారమళ్ల జీవనజ్యోతి, సుధాకర్‌రావు దంపతుల కుమారుడు రోహిత్ కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ మిచ్చిగన్ ప్రాంతానికి చెందిన లావోరా ప్రేయర్, తిమోతి ప్రేయర్ దంపతుల కుమార్తె రెబెకా ప్రేయర్(భార్గవి)తో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాల తల్లిదండ్రులు పెళ్లిక ఒప్పుకున్నారు. బుధవారం నాగోల్ డివిజన్‌లోని అల్కాపురిలో హిందూ వివాహ పద్ధతిలో ఆ ప్రేమ జంట ఒక్కట య్యింది. బంధువులు నాగోల్ అబ్బాయి, అమెరికా అ మ్మాయిని ఆశీర్వదించారు.