calender_icon.png 9 October, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశీయ ‘జోహో’కు మారిన అమిత్‌షా

09-10-2025 12:44:27 AM

  1. ఇక నుంచి ఇదే నా ఈనూ చిరునామా

ఎక్స్‌లో పోస్టు చేసిన అమిత్‌షా

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు.. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా ‘జోహో ప్లాట్‌ఫామ్ వైపు కేంద్ర మంత్రులు మొగ్గుచూపుతున్నారు. అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోహో మెయిల్‌లోకి మారిపోయారు.

ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా బుధవారం వెల్లడించారు. “హలో.. నేను జోహో మెయిల్‌కు మారాను. నా ఈనూమెయిల్ చిరునామాలో ఈ మార్పును గమనించండి. amithshah.bjp@zohomail.in నా కొత్త మెయిల్ అడ్రస్‌” అని అమిత్ షా తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక నుంచి మెయిల్స్ అన్నీ ఈ కొత్త అడ్రస్‌కే పంపాలని చెప్పారు.

భారత్‌ఫై అమెరికా సుంకాల మోత, జీఎస్టీ సంస్కరణల వేళ ప్రధాని మోదీ ‘స్వదేశీ’ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో -స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు మేరకు మంత్రులు జోహో సేవలను వినియోగిస్తున్నారు. కాగా జీమెయిల్, మైక్రోసాఫ్ట్‌లకు పోటీగా స్వదేశీ జోహో మెయిల్‌ను తీసుకువచ్చారు.