23-05-2025 01:44:37 AM
తూప్రాన్, మే 22 : తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ పాతురి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో 11వ వార్డు చెరువుకట్ట పైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు, వివిధ మహిళా సంఘలు ప్రతినిధుల ద్వారా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని వారు తెలిపారు. ఇందులో మెప్మా సిఓ ఆసియా, ఆర్ పి లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.