19-12-2025 12:35:10 AM
నారాయణఖేడ్, డిసెంబర్ 18(విజయక్రాంతి) : నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆటోవాలా గెలుపొందడంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆటో నడిపిస్తూ జీవ నం కొనసాగిస్తున్న నడిమిదొడ్డి పూలమ్మ సమెల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి గెలుపొందాడు. సంబంధిత గ్రామంలో గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతూ వచ్చాడు.
కాగా ఈసారి కాం గ్రెస్ పార్టీ బలపర్చిన ఆటో సామెల్‌కు స్థానిక ఓటర్లు పట్టం కట్టడంతో నా రాయణఖేడ్ ప్రాంతంలో సంచలనమే అని ప్రజలు, ఆటో డ్రైవర్లు అంటున్నారు. కాగా గ్రామంలో ఉప స ర్పంచ్‌గా సైతం ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నకే సంగారెడ్డి వార్డు మెంబర్‌గా గెలవడంతో ఆ యనకే ఉపసర్పంచ్ పదవి వరించింది. దీంతో నారాయణఖేడ్‌లోని ఆటో యూ నియన్ నాయకు లు సంబరాలు జరుపుకున్నారు.