19-06-2025 05:00:12 PM
ఖానాపూర్ అఖిలపక్షం పార్టీల డిమాండ్..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరు కాగా దానిని ఖానాపూర్ ఎమ్మెల్యే ఊట్నూరుకు తరలించకపోవడం సమంజసం కాదని, దానిని ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని నిర్మించే ఏర్పాటు చేయాలని గురువారం ఖానాపూర్ అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఖానాపూర్ తెలంగాణ తల్లి చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ... ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ వద్ద ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ భూమిలో 47 ఎకరాలు ప్రభుత్వ వివిధ శాఖలకు కేటాయించగా, ఇంకా సుమారు 40 ఎకరాలు పైచిలుకు స్థలం మిగిలి ఉందని, ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు కేవలం 25 ఎకరాలు అవసరం ఉండగా స్థానిక తాసిల్దార్ ఇక్కడ స్థలం లేదని తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే దానిని ఉట్నూర్ పట్టణానికి తరలించకపోయి, ఖానాపూర్ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని ఇకనైనా దాన్ని ఆపివేసి ఖానాపూర్ పట్టణంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కే గంగారావు, బీసీ రాజన్న ,కొక్కుల ప్రదీప్ , బీసీ రమేష్ ,తోకల బుచ్చన్న ,గౌరీకర్ రాజు ,సిహెచ్ రాజు ,మనోజ్ ,మురళి, తదితరులు ఉన్నారు.