11-07-2025 11:00:50 PM
అంబేద్కర్ యువజన సంఘం
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం మేర యువ భారత్ ఆధ్యర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాదావత్ అశోక్ మాట్లాడుతూ... దేశ వనరులు సరిపడేలా నిర్వహించుకోవాలంటే జనాభా నియంత్రణ కచ్చితంగా అవసరం జనాభా పెరిగే కొద్ది జాబ్స్ తగ్గుతాయని సవాళ్లు పెరుగుతాయని వనరుల కొరత ఏర్పడుతుంది.
ఇతర ఇబ్బందులతో పాటు క్రైమ్ రేట్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే ఈ విషయాలను కంట్రోల్ చేసేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కుటుంబం కోసమే కాకుండా సమాజం శ్రేయస్సు కోసం కూడా ఫ్యామిలీ ప్లానింగ్‌పై అందరికీ అవగాహన ఉండాలి. ఇది అభివృద్ధికి నాంధి అవుతుంది. ఆర్థికంగానే కాదు.పర్యావరణ భవిష్యత్‌కి కూడా ఇది మంచిదని అందరూ గుర్తించాలనీ చెప్పడం జరిగింది. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ అశోక్ బహుమతులు అందజేశారు.