calender_icon.png 12 July, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టల గంగారంలో వైద్య శిబిరం

11-07-2025 10:50:04 PM

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కన్నాయిగూడెం వైద్యాధికారి డాక్టర్ అభినవ్ ఆధ్వర్యంలో,రాజన్నపేట సబ్‌సెంటర్ లోని గుట్టల గంగారం గ్రామాన్ని సందర్శించి వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. జ్వర లక్షణాలతో ఉన్న రోగులకు ఆర్డీటీ పరీక్షలు నిర్వహించి,వారికి మందులు పంపిణీ చేయడం అయినది.అలాగే గృహాల వారీగా సర్వే నిర్వహించి,లార్వా ఉన్న కంటైనర్లను తొలగించాము. ప్రజల్లో జ్వరాల నివారణకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించాము.ఈ సబ్‌సెంటర్ పరిధిలోని ఆర్ఎంపి క్లినిక్‌ను కూడా సందర్శించాము. అవసరం లేని యాంటిబయాటిక్స్ మరియు స్టెరాయిడ్స్ వాడకూడదని సూచించి,జ్వర కేసుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించాము.