11-07-2025 10:47:36 PM
వాజేడు,(విజయక్రాంతి): గత వారం రోజులుగా తెలంగాణ, చత్తీస్గడ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తోంది. వాజేడు మండల పరిధిలో పేరూరు వద్ద శుక్రవారం నాటికి గోదావరి నీటిమట్టం 17మీటర్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. కావున ఎవరు చేపల వేటకు వెళ్లరాదని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.